Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:22 AM

నకిరేకల్ పట్టణ అభివృద్ధికి వేగం… డ్రెయినేజీ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన

31-12-2025 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్‌లో అభివృద్ధికి శంకుస్థాపనలు… డ్రెయినేజీ, సీసీ రోడ్లతో పట్టణానికి కొత్త ఊపిరి

నకిరేకల్ స్థానికం ప్రతినిధి
నకిరేకల్ పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. బుధవారం నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 02, 05, 10, 11, 12, 20 వార్డుల్లో నూతనంగా చేపట్టనున్న డ్రెయినేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత–శ్రీనివాస్, వైస్ చైర్మన్ మూరారిశెట్టి ఉమారాణి–కృష్ణమూర్తి, కమిషనర్, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. డ్రెయినేజీతో పాటు సీసీ రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే రూ.6 కోట్లతో పనులు చేపట్టామని చెప్పారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

త్వరలో నకిరేకల్‌లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభం కానుందని, అందులో ట్రామా కేర్ సెంటర్‌తో పాటు డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు కూడా త్వరలో శంకుస్థాపనలు చేస్తామని అన్నారు.

గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించిన ఎమ్మెల్యే, ప్రస్తుతం ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన అజెండాగా ముందుకు సాగుతోందని అన్నారు. నకిరేకల్ పట్టణంలోని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని కూడా చేపడతామని వెల్లడించారు.

Sthanikam

నకిరేకల్ పట్టణ అభివృద్ధికి వేగం… డ్రెయినేజీ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News