Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:15 PM

నకిరేకల్ పోలీసుల అప్రమత్తత.. తల్లి ఒడికి చేరిన చిన్నారి

27-12-2025 231 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కుటుంబానికి అండగా నిలిచిన ఎస్సై వీరబాబు

నకిరేకల్ పోలీసులకు హ్యాట్సాఫ్! తప్పిపోయిన చిన్నారిని అప్రమత్తతతో కాపాడి, అతి తక్కువ సమయంలోనే తల్లిదండ్రుల చెంతకు చేర్చిన నకిరేకల్ పోలీసులు.

నకిరేకల్ స్థానీకం వార్తలు:

ప్రయాణ హడావిడిలో తల్లికి తెలియకుండా బస్సు దిగి తప్పిపోయిన ఓ చిన్నారిని, నకిరేకల్ పోలీసులు అత్యంత చాకచక్యంగా, అప్రమత్తంగా వ్యవహరించి కేవలం కొద్దిసేపట్లోనే తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన నకిరేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దండుగల చైత్ర (తండ్రి రాజు) అనే చిన్నారి తన తల్లితో కలిసి సూర్యాపేట వెళ్తుండగా, మార్గమధ్యలో నకిరేకల్ సెంటర్‌లో తల్లికి తెలియకుండా ప్రమాదవశాత్తు కిందకు దిగింది. వాహనం ముందుకు వెళ్లడం, పాప ఒంటరిగా మిగిలిపోవడంతో ఆందోళనకు గురైంది.

గమనించిన స్థానికులు పాపను వెంటనే నకిరేకల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వీరబాబు గారు వెంటనే స్పందించారు. పాపతో ఆప్యాయంగా మాట్లాడి వివరాలు సేకరించారు. సాంకేతికతను, సిబ్బందిని వినియోగించి పాప కుటుంబ సభ్యుల వివరాలు కనుగొన్నారు. వెంటనే వారికి సమాచారం అందించి, పోలీస్ స్టేషన్‌కు రప్పించి పాపను క్షేమంగా అప్పగించారు.

పోలీసులు చూపిన చొరవకు, అప్రమత్తతకు పాప తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన నకిరేకల్ పోలీసులను, ఎస్సై వీరబాబును స్థానికులు అభినందించారు.

Sthanikam

నకిరేకల్ పోలీసుల అప్రమత్తత.. తల్లి ఒడికి చేరిన చిన్నారి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News