Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:32 AM

నకిరేకల్ నియోజకవర్గంలో ప్రమాణ స్వీకారాల హడావిడి… కాంగ్రెస్ శక్తి ప్రదర్శన

22-12-2025 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్‌లో గ్రామ పాలనకు కొత్త ఊపిరి

నకిరేకల్, స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గంలో గ్రామపంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. చిట్యాల, కట్టంగూర్ మండలాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామపంచాయతీలో సర్పంచ్‌గా ఎన్నికైన నాగంపళ్లి శ్యామ్, ఉపసర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని నూతన పాలకవర్గాన్ని సన్మానించారు. గ్రామ అభివృద్ధికి సమష్టి కృషి అవసరమని నాయకులు సూచించారు.

కట్టంగూర్ మండలం బొల్లెపెల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్‌గా ఎన్నికైన వల్లపు వెంకట్ నారాయణ రెడ్డి ప్రమాణ స్వీకార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనమండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే కట్టంగూర్ మేజర్ గ్రామపంచాయతీ కట్టంగూరులో సర్పంచ్‌గా ఎన్నికైన ముక్కాముల శ్యామల శేఖర్ ప్రమాణ స్వీకార సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి సుంకరబోయిన నరసింహ యాదవ్ అధ్యక్షత వహించారు.

ఈ మూడు కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, మాజీ ఎంపీపీ ముత్తిలింగం, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మాదా లింగస్వామి గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చత్రపతి, నర్సింగ్ దుర్గయ్య గౌడ్, మాజీ సర్పంచ్ జింజరాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నకిరేకల్ నియోజకవర్గంలో ప్రమాణ స్వీకారాల హడావిడి… కాంగ్రెస్ శక్తి ప్రదర్శన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News