Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:42 AM

నకిలీ గుళికలతో నష్టపోయిన కక్కిరేణి రైతులను ఆదుకోవాలి

24-12-2025 1,449 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎకరానికి రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి

జిల్లా వ్యవసాయ అధికారికి వినతి.. న్యాయం చేస్తామని హామీ

(రామన్నపేట/కక్కిరేణి, స్థానికం న్యూస్):

నకిలీ గుళికల కారణంగా పంట నష్టపోయిన కక్కిరేణి రైతులను ఆదుకోవాలని, వారికి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక బాధిత రైతులతో కలిసి ఆయన జిల్లా వ్యవసాయ అధికారి (DAO) పి.వి. రమణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

అసలేం జరిగింది?

ఈ సందర్భంగా మేక అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో సుమారు 30 మంది రైతులు 'క్లోమాట 10జి' (Clomata 10G) గుళికలను కొనుగోలు చేశారు. దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో వేసిన నారు మడులకు, నాట్లు వేసిన పొలాలకు ఈ గుళికలు చల్లగా.. నారు పూర్తిగా మాడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో, దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు.

కంపెనీ తప్పిదాన్ని ఒప్పుకుంది: సంబంధిత కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు జరిపి, లోపం తమ గుళికల్లోనే ఉందని నిర్ధారించుకుని, తప్పును అంగీకరించారని అశోక్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రధాన డిమాండ్లు:

నకిలీ గుళికల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25,000 చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలి.

సదరు కంపెనీపై సమగ్ర విచారణ జరిపి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి.

పాల్గొన్న వారు: ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు గన్నేబోయిన విజయభాస్కర్, బోయిని ఆనంద్, మాజీ సర్పంచ్ పిట్ట కృష్ణారెడ్డి, ముక్కామల రవి, సామాజిక కార్యకర్త వేముల సైదులు, కన్నెబోయిన వెంకటేశ్వర్లు, బుర్ర సైదులు, నాగేష్, గుండాల మల్లేష్, గుండెపూరి శ్రీను, సోమన బోయిన రామచంద్రం, బెక్కంఠి సత్తయ్య, కొన్నె రాజు, వేముల దుర్గయ్య, శ్రీను, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నకిలీ గుళికలతో నష్టపోయిన కక్కిరేణి రైతులను ఆదుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News