Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:35 AM

నాగిరెడ్డిగూడెం గ్రామంలో మంచి నీళ్లు లేక అవస్థలు పడుతున్న ప్రజలు

19-01-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి జనవరి 19(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని నాగిరెడ్డి గూడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలుగా మంచినీటి ఎద్దడి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామని త్రాగడానికి, అవసరాలకు వాడుకోవటానికి కూడ నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఒకే మోటార్ తో నీరు సరిపోవడం లేదని మూడు రోజులైనా నీరు రాక ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. ప్రస్తుతమే ఈ పరిస్థితి నెలకొంటే ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగర పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని అన్నారు. ఎత్తులో ఉండటం వల్ల పల్లం లోకి నీళ్లు వెళుతున్నాయని ఆ నీటిని మోటార్లు పెట్టి ఇళ్లలోకి ర ప్పించుకుంటున్నారని తెలిపారు. 30 ఇళ్ళకు నీళ్లు లేక అవస్థలు పడుతున్నామని ప్రస్తుతం ఒక మోటార్ తో నీళ్లు పంపిస్తున్నారని కానీ ఒక మోటార్ నీళ్ళు సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.క్రొత్త లైన్ వేసి గేటు వాలు బిగిస్తే నీరందుతుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన సమస్య పరిష్కరించడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Sthanikam

నాగిరెడ్డిగూడెం గ్రామంలో మంచి నీళ్లు లేక అవస్థలు పడుతున్న ప్రజలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News