Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:26 AM

నేటి తరానికి సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శం

03-01-2026 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బాకారం లావణ్య, రత్నపురం పద్మ పిలుపు

భువనగిరి స్థానికం ప్రతినిధి

చదువుల తల్లి, సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలవాలని తెలంగాణ ఉద్యమకారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు బాకారం లావణ్య, జిల్లా అధ్యక్షురాలు రత్నపురం పద్మ పిలుపునిచ్చారు.

శనివారం భువనగిరి పట్టణ శివారులోని శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ పాఠశాలలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 196వ జయంతి వేడుకల్లో వారు పాల్గొని మాట్లాడారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాజీ మండల విద్యాధికారి బండారు రవివర్ధన్ మాట్లాడుతూ, సుమారు 180 ఏళ్ల క్రితమే బాలికల విద్య కోసం 18 మహిళా పాఠశాలలు స్థాపించిన సావిత్రిబాయి పూలే దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలని కొనియాడారు. జిల్లా ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు బర్రె సుదర్శన్ బాల్యవివాహాల నిషేధం, వితంతు వివాహాల ప్రోత్సాహం, సతీ సహగమనానికి వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటాలను గుర్తుచేశారు.జిల్లా బాలల పరిరక్షణ కమిటీ సభ్యుడు ఎర్ర శివరాజ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ త్యాగాల ఫలితంగానే ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, వారి జీవితాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు.పాఠశాల కరస్పాండెంట్ తోటకూర యాదయ్య విద్యార్థులు చదువులో పోటీపడి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ తోటకూర సంతోష్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

నేటి తరానికి సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News