Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:11 PM

నేడు భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

28-12-2025 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఈరోజు నుండి 24 గంటలు ఆలయ దర్శనం

స్థానికం ప్రతినిది జెర్రిపోతుల బిక్షం

రాజన్న జిల్లా డిసెంబర్28

వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు ఆదివారం తెల్లవారుజాము నుండి పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేములవాడకు భారీగా తరలివచ్చారు. భక్తులు ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని, ధర్మ గుండంలో పవిత్ర స్నానా లను ఆచరిస్తున్నారు.

రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు కోడెమొక్కు క్యూలైన్‌లో సుమారుగా 3 గంటలపాటు నిరీక్షించినట్లు భక్తులు తెలిపారు. ధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్‌లో భక్తులు గంటల తరబడి వేచి ఉండి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించు కుంటున్నారు భక్తులు. ఈ నేపథ్యంలోనే మేడారం సమ్మక్క,సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ ఉంది. ఈ క్రమంలోనే శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి దర్శనానికి భక్తులు ఈరోజు ఉదయం పెద్ద సంఖ్యలో తరలి వస్తుండగా... ఈరోజు నుండి ఆలయం 24 గంటల పాటు తెరిచి ఉంచనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. వచ్చే సంవత్సరం జనవరి 4,11, 18,తేదీల్లో సైతం 24 గంటలు తెరవనున్నామని పేర్కొన్నారు. భీమన్న ఆలయానికి సమీపంలో ఉన్న బద్ది పోచమ్మ అమ్మవారి దర్శనాన్ని కూడా రేపు సోమవారం 24 గంటల పాటు దర్శనం కల్పించనున్నట్లు ఈవో రమాదేవి,వివరించారు.

Sthanikam

నేడు భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News