Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:30 AM

నారాయణఖేడ్‌లో రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

08-01-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా నారాయణఖేడ్ పట్టణంలో ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు రాజీవ్ చౌక్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ డిఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం పాల్గొని వాహనదారులకు రోడ్డు భద్రతపై ముఖ్యమైన సూచనలు చేశారు. హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించిన తర్వాత వాహనం నడపరాదని స్పష్టంగా అవగాహన కల్పించారు.రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించిన వాహనదారులను శాలువాలతో సత్కరించి ప్రోత్సహించారు. ప్రజల్లో భద్రతా నిబంధనలపై అవగాహన పెంచి, భవిష్యత్తులో ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Sthanikam

నారాయణఖేడ్‌లో రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా నారాయణఖేడ్ పట్టణంలో ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు రాజీవ్ చౌక్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ డిఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం పాల్గొని వాహనదారులకు రోడ్డు భద్రతపై ముఖ్యమైన సూచనలు చేశారు. హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించిన తర్వాత వాహనం నడపరాదని స్పష్టంగా అవగాహన కల్పించారు.రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించిన వాహనదారులను శాలువాలతో సత్కరించి ప్రోత్సహించారు. ప్రజల్లో భద్రతా నిబంధనలపై అవగాహన పెంచి, భవిష్యత్తులో ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News