Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:06 AM

నారాయణఖేడ్ అక్షిత ప్రతినిధి: డిసెంబర్ 21న జరగనున్న జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవా

18-12-2025 440 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కుటుంబ, ఆస్తి వివాదాలకు శాంతియుత పరిష్కారం సాధ్యం

జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ పిలుపు

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:

డిసెంబర్ 21న జరగనున్న జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలిపారు. క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్‌అదాలత్ మంచి అవకాశమని, రాజీ కుదుర్చుకునే వీలున్న అన్ని కేసుల్లో కక్షిదారులు ముందుకు రావాలని సూచించారు.

అనవసర గొడవలకు వెళ్లి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోవద్దని, రాజీ ద్వారా ఇరు వర్గాలు గెలిచినట్లే అవుతుందని ఎస్పీ అన్నారు. ఈ నెల 21 ఆదివారం నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా ప్రజలు సహకరించాలని కోరారు.

ఎస్‌హెచ్‌వోలు, కోర్టు డ్యూటీ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ, వైవాహిక జీవితం సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి రాజీకి అనుకూలమైన కేసుల్లో ఇరు వర్గాల సమ్మతితో పరిష్కారం సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సైబర్ నేరాలకు సంబంధించి బాధితులు కోల్పోయిన డబ్బులు త్వరితగతిన తిరిగి అందేలా చూడాలని, రూ.25 వేలలోపు నష్టం జరిగిన కేసుల్లో లోక్‌అదాలత్ ద్వారా ఫిర్యాదు తీసుకుని ఎఫ్‌ఐఆర్ లేకుండానే రీఫండ్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

జిల్లాలో జరగనున్న జాతీయ మెగా లోక్‌అదాలత్ విజయవంతం కావడానికి అధికారులు నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రాజీ పడదగిన అన్ని కేసుల్లో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

Sthanikam

నారాయణఖేడ్ అక్షిత ప్రతినిధి: డిసెంబర్ 21న జరగనున్న జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News