Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:00 AM

నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు న్యాయం చేయాలి సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

23-12-2025 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాణ్యమైన దర్యాప్తుతోనే న్యాయం సాధ్యం

బాధితులకు భరోసా కల్పించాలి – ఎస్పీ పరితోష్ పంకజ్

స్థానిక ప్రతినిధి సంగారెడ్డి

ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేసి బాధితులకు అండగా నిలవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు.

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్పీ, అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, మిస్సింగ్, ఎఫ్‌బీడబ్ల్యూ కేసుల పురోగతిని సమీక్షించారు. దర్యాప్తు వేగం పెంచి ప్రతి కేసును నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. లాంగ్ పెండింగ్ కేసుల చేధనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, దర్యాప్తులో సందేహాలు ఎదురైతే ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ఎస్‌హెచ్‌ఓలు తమ పరిధిలోని ప్రతి గ్రామాన్ని క్రమం తప్పకుండా సందర్శించి స్థానిక సమస్యలను గుర్తించాలని అన్నారు. విలేజ్ పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహనతో ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు. రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై నిఘా పెంచాలని, బ్లూకోల్ట్స్ మరియు నైట్ పెట్రోలింగ్ సిబ్బంది పాపిలోన్ డివైస్‌లను వినియోగించి అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్లు సేకరించాలని ఆదేశించారు.

విమెన్ సేఫ్టీ, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాలపై గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరచాలని సూచించారు.

అనంతరం ఎస్‌హెచ్‌ఓ వాహనాలను తనిఖీ చేసిన ఎస్పీ, ప్రతి వాహనం రెగ్యులర్ సర్వీసింగ్‌తో పూర్తి కండిషన్‌లో ఉండేలా చూడాలని డ్రైవర్లకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను రాంగ్ రూట్‌లో నడపరాదని హెచ్చరించారు.

ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ సిహెచ్ రఘునందన్ రావు, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, ప్రభాకర్, వెంకట్ రెడ్డి, సైదా నాయక్, సురేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు రమేష్, కిరణ్ కుమార్, నాగేశ్వర రావు, సదా నాగరాజు, ప్రవీణ్ రెడ్డి, ఆర్‌ఐలు రామారావు, రాజశేఖర్, జిల్లా ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు న్యాయం చేయాలి సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News