Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:27 AM

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

22-12-2025 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండలో గణిత దినోత్సవ వేడుకలు… రామానుజన్ సేవలపై ప్రసంగాలు

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ డాక్టర్ మల్లేశ్వరి మాట్లాడుతూ, రామానుజన్ జీవితం, ఆయన గణిత రంగానికి అందించిన అపూర్వమైన సేవలను ఉదాహరణలతో సహా ఆసక్తికరంగా వివరించారు. అధికారిక విద్య పరిమితంగా ఉన్నప్పటికీ, స్వయంకృషితో గణితంలో అసాధారణ ప్రతిభ కనబరిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తిగా రామానుజన్ నిలిచారని చెప్పారు. చిన్న వయసులోనే గణితంపై అపారమైన ఆసక్తితో క్లిష్టమైన సూత్రాలను స్వయంగా ఆవిష్కరించారని తెలిపారు.

అలాగే ఆయన ప్రతిభను గుర్తించిన బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త జి. హెచ్. హార్డీ సహకారంతో ఇంగ్లాండ్‌లో పరిశోధనలు కొనసాగించి, నంబర్ థియరీ, ఇన్‌ఫినిట్ సిరీస్, మ్యాథమెటికల్ ఫార్ములాస్ వంటి రంగాల్లో గణనీయమైన కృషి చేశారని పేర్కొన్నారు. తక్కువ వయసులోనే మరణించినప్పటికీ, ఆయన చేసిన సేవలు గణిత ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోయాయని అన్నారు. డిసెంబర్ 22న ఆయన జన్మదినాన్ని దేశవ్యాప్తంగా జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ, రామానుజన్ అసాధారణ ప్రతిభ విద్యార్థులకు ఎప్పటికీ ప్రేరణనిచ్చేదిగా ఉంటుందని అన్నారు. కష్టపడి చదివితే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందవచ్చన్న సందేశాన్ని ఆయన జీవితం అందిస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు వివిధ గణిత పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మ్యాథమెటిక్స్ విభాగానికి చెందిన లెక్చరర్లు డాక్టర్ డి. మధుకర్, కే. కనకయ్య, పార్వతి, శోభ, బాల కార్తిక్, మతిన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News