Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:23 AM

ముసునూరు మండలంలో రాత్రి వేళ దొంగల హడావిడి

09-03-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ముసునూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇటీవల దొంగతనాలు పెరుగుతుండటంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చెక్కపల్లి గ్రామానికి చెందిన మామిడి శెట్టి సత్యనారాయణకు చెందిన జేసీబీ యంత్రంలో దొంగతనం చోటుచేసుకుంది.

సత్యనారాయణకు చెందిన జేసీబీని డ్రైవర్ సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో సొంత పొలంలో పార్కింగ్ చేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు పని ఉండడంతో వెళ్లి చూడగా జేసీబీ డోర్ తెరిచి ఉండటాన్ని గమనించి ఆశ్చర్యానికి గురయ్యాడు. పరిశీలించగా స్పీడోమీటర్ బోర్డు, స్విచ్‌లు, తాళం కిట్, టేపురికార్డు బాక్సులు, రెంచీలు వంటి వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసి తీసుకెళ్లినట్లు తెలిసింది.

దొంగిలించిన వస్తువుల విలువ సుమారు రూ.30 వేల వరకు ఉంటుందని యజమాని తెలిపారు. ఇది సాధారణ దొంగతనమా లేక శత్రుత్వంతో చేసిన పనినా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మండలంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలతో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే గ్రామాల్లో రాత్రి వేళ కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Sthanikam

ముసునూరు మండలంలో రాత్రి వేళ దొంగల హడావిడి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News