Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:12 PM

మునుగోడు లో దివ్యాంగులకు ఆరోగ్య శిబిరాలు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

మునుగోడు లో దివ్యాంగులకు ఆరోగ్య శిబిరాలు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

మునుగోడు లో దివ్యాంగులకు ఆరోగ్య శిబిరాలు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
February 19, 2026 10:57 PM 192 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని దివ్యాంగుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఆయన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా మునుగోడులో దివ్యాంగుల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహించాలనీ కోరారు.స్పైనల్ కార్డ్, మస్కులర్ సంబంధిత దివ్యాంగులకు ప్రతి నెల అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ఇతర అవసరమైన వస్తుసామగ్రిని అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మునుగోడు నియోజకవర్గంలోని దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ‘వికలాంగుల భవనం’ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దివ్యాంగుల సమస్యల పట్ల తనకు ప్రత్యేక శ్రద్ధ ఉందని, భవిష్యత్తులో తప్పకుండా అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కాంగ్రెస్ ఎన్నికల ఇంచార్జి పబ్బు రాజుగౌడ్, టీవీహెచ్‌ఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ గుత్తికొండ, రాష్ట్ర కార్యదర్శి మెరుగు శివకృష్ణ, మహిళా నాయకురాలు యశోద గోదా, కాంగ్రెస్ దివ్యాంగుల విభాగం, కొడిదల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News