Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:22 PM

మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పోటీ

మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పోటీ

మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పోటీ
14-01-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేటలో అన్ని వార్డుల్లో అభ్యర్థులు – సతీష్ రెడ్డి

సూర్యాపేట:

రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ మేకల సతీష్ రెడ్డి ప్రకటించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రితిక ఇన్ బ్యాంకెట్ హాల్‌లో నిర్వహించిన జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతోందన్నారు.

బీజేపీతో పొత్తుపై ప్రస్తుతం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో జనసేన మద్దతుదారులు సాధించిన విజయాలు కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయని అన్నారు. అదే స్ఫూర్తితో మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ సత్తా చాటి అభ్యర్థులను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పార్టీ ఆశయాలు, విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురిని జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పోటీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News