Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తడ్కల్‌లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. భారీ ర్యాలీలో పాల్గొన్న యువత, ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:36 PM

మున్సిపల్ కార్యాలయంలో తుది ఓటర్ల జాబితా ప్రదర్శన

16-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రజల సౌకర్యార్థం పోలింగ్ స్టేషన్‌ల వారీగా అందుబాటులో ఉంచిన అధికారులు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

మున్సిపల్ సాధారణ ఎన్నికల సందర్భంగా పోలింగ్ స్టేషన్‌ల వారీగా రూపొందించిన తుది ఓటర్ల జాబితాలను ప్రజల సౌకర్యార్థం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ప్రదర్శించారు. ఓటర్లకు తమ వివరాలను సులభంగా పరిశీలించుకునే విధంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ తుది ఓటర్ల జాబితాలను జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను పాటిస్తూ ప్రతి ఓటరుకు సమాచారం చేరేలా చర్యలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్‌ల వారీగా ఓటర్ల జాబితాలను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. మున్సిపల్ సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ కిరణ్, మేనేజర్ బుచ్చి బాబు, టీపీఓ సోమయ్య, ఆర్వో కళ్యాణి, సీనియర్ అసిస్టెంట్ నాగయ్య, బీఐ అఖిల్, జూనియర్ అసిస్టెంట్లు యం.డి. గౌసుద్దీన్, ఎస్.ఎస్.ఆర్. ప్రసాద్, వీరాస్వామి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ కార్యాలయంలో తుది ఓటర్ల జాబితా ప్రదర్శన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News