Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:37 PM

మున్సిపల్ ఎన్నికలపై బిఆర్ఎస్ నాయకుల కీలక భేటీ

13-01-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ మున్సిపాలిటీలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ జెడ్పీ చైర్మన్ జయపాల్ రెడ్డి మరియు నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నారాయణఖేడ్ మున్సిపాలిటీలో తప్పకుండా గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికపై వివరంగా చర్చించారు.ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, మాజీ ఉపాధ్యక్షులు పరశురాం, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు విజయ్ బుజ్జి, మాజీ ఎంపిటిసి సభ్యులు ముజామిల్, మాజీ కౌన్సిలర్లు అభిషేక్ షెత్కార్, విఠల్, మాజీ మున్సిపల్ సహనియుక్త సభ్యులు లయక్, అంబాదాస్, ఉబేద్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్, నాయకులు సతీశ్ దేశ్ముక్, కొమ్ము శేఖర్, అబ్బు, దుర్గయ్య, నర్సింలు, నాగరాజు, కిరణ్ రావు పాటిల్, అశోక్ రెడ్డి, తుకారాం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని, రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించేలా అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికలపై బిఆర్ఎస్ నాయకుల కీలక భేటీ

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News