Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:40 AM

మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు పూర్తి

మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు పూర్తి

మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు పూర్తి
11-01-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జనవరి 12న ఫైనల్ ఓటర్ లిస్ట్,16న పోలింగ్ స్టేషన్ల వివరాలు

ఫిబ్రవరి 20లోపు ఎన్నికలు జరిగే అవకాశం

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక దశలను పూర్తి చేస్తోంది. ఈ నెల 12వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్ట్‌ను, 16వ తేదీన వార్డు వారీగా పోలింగ్ స్టేషన్‌ల వివరాలను పబ్లిష్ చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ ప్రక్రియ పూర్తయ్యాక మున్సిపల్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేయనుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు వార్డు వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఓటర్ లిస్ట్ ఆధారంగా గుర్తించి, నిర్దేశించిన గడువులో మున్సిపాలిటీలు సంబంధిత జాబితాలను ప్రచురించనున్నాయి. జనాభా ఆధారంగా వార్డు రిజర్వేషన్లు వార్డు వారీగా గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా ఆధారంగా వార్డులను ఫిల్టర్ చేసి, ఆ వివరాలతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఓపెన్ డ్రా పద్ధతిలో వార్డు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఇందులో భాగంగా 50 శాతం సీట్లను మహిళలకు రిజర్వేషన్‌గా కేటాయించనున్నారు.హైదరాబాద్‌లో ఛైర్మన్ డ్రా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల చైర్మన్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను హైదరాబాద్‌లో రొటేషన్ పద్ధతిలో డ్రా తీసి ఖరారు చేయనున్నారు.ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు అవకాశాలు ముఖ్యమంత్రి దావోస్ పర్యటన, అలాగే ఫిబ్రవరి తొలి వారంలో జరిగే తెలంగాణలో అతిపెద్ద సమ్మక్క–సారక్క జాతర నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని, మున్సిపల్ ఎన్నికలను ఫిబ్రవరి 20వ తేదీ లోపు పూర్తిచేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మొత్తంగా చూస్తే, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం వేగంగా ముందుకు సాగుతుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా కొనసాగుతోంది.

Sthanikam

మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు పూర్తి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News