Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:15 AM

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తత అవసరం

13-01-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

పోలింగ్ బూత్ వసతులు,ఉద్యోగుల తటస్థతపై అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశాలు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మంగళవారం చౌటుప్పల్ పురపాలక సంఘంలో వార్డు ఆఫీసర్లు,బిల్ కలెక్టర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేయబడింది.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి పోలింగ్ బూత్‌లో ప్రాథమిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని స్పష్టం చేశారు.పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు,విద్యుత్ వసతి,సరైన వెంటిలేషన్,కిటికీలు,తలుపులు, మరుగుదొడ్లు,ర్యాంపు వంటి అన్ని సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఎన్నికల ప్రక్రియలో భాగంగా విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయాలని,ఈ కాలంలో సెలవులు మంజూరు చేయబడవని తెలిపారు.ఎన్నికల విధుల్లో ఉన్న ఎవరూ ఏ రాజకీయ పక్షానికి అనుకూలంగా వ్యవహరించరాదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అదనంగా,ఈరోజు డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్‌ల వివరాలను విడుదల చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.వెంకట్రాం రెడ్డి,మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి,ఆర్వో అంజయ్య,సీనియర్ అసిస్టెంట్లు దీప,రఘుపతి,వార్డు ఆఫీసర్లు,బిల్ కలెక్టర్లు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తత అవసరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News