Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:10 PM

మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – కలెక్టర్ హనుమంతరావు

12-02-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆరు మున్సిపాలిటీలలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు సమగ్రంగా పరిశీలించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి గురువారం దివ్య బాల స్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్‌ను సందర్శించారు.

కౌంటింగ్ హాళ్ల ఏర్పాటు, టేబుళ్ల అమరికలు, సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా చర్యలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, త్రాగునీరు, విద్యుత్ సరఫరా తదితర మౌలిక వసతులపై కలెక్టర్ విపులంగా పరిశీలించారు. ఎన్నికల నియమావళి ప్రకారం కౌంటింగ్ ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల్లో అత్యంత కీలక దశ. ప్రతి అంశంలో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తూ, పారదర్శకతతో పాటు సమయపాలనను కచ్చితంగా అమలు చేయాలి” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్లు, రెవిన్యూ డివిజనల్ అధికారులు కృష్ణారెడ్డి, నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, పోలీసు సిబ్బంది మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – కలెక్టర్ హనుమంతరావు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News