Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:10 PM

మున్సిపల్ కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. కలెక్టర్ హనుమంతరావు

11-02-2026 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలి.

భువనగిరి, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ఎటువంటి అంతరాయాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.బుధవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి మండలంలోని దివ్య బాల విద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లను సమీక్షించారు.ఈ సందర్భంగా కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూమ్స్, సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రతా చర్యలు, టేబుళ్ల అమరిక, సిబ్బంది నియామకాలు వంటి అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి టేబుల్ వద్ద అన్జర్వర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అభ్యర్థులు, వారి ఏజెంట్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, కూర్చునే సౌకర్యం, ప్రాథమిక వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడు అంచెల భద్రత ఏర్పాటు చేసి, అనుమతి ఉన్నవారికే ప్రవేశం కల్పించాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కౌంటింగ్ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించి ఫలితాలను సమయానికి ప్రకటించాలని అధికారులను కలెక్టర్ కోరారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. కలెక్టర్ హనుమంతరావు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News