Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం

Updated : 21 Jan 2026 13:47 IST
As Preferred Source 1 min read
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం

హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:మున్సిపాలిటీ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ రోజు తొర్రూరు డివిజన్ పరిధిలో సుమారు 150 మందికి పైగా మున్సిపల్ కార్మికులు పూటపూట పారిశుద్ధ పనులు నిర్వర్తిస్తున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు,మహిళలు మరియు ఇతర సేవా కార్యకర్తలు సక్రమంగా పాల్గొన్నారు.నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ స్థానిక ఎమ్మెల్యే యశస్వి రెడ్డి, జిల్లా కలెక్టర్ మరియు మునిసిపల్ కమిషనర్‌లతో చర్చించి, కార్మికులకు అవసరమైన మౌలిక వసతులు వెంటనే అందించాలని నిర్ధారించారు. పారిశుద్ధ కార్మికుల శ్రమ వలనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది. వారి కృషి, అనుభవం, పట్టుదల మరియు అంకితభావం అమూల్యమైనదని ప్రత్యేకంగా గుర్తించారు.ఈ సందర్భంగా, కార్మికులు కోరిన హ్యాండ్ బ్లౌజులు, నూనె, పౌడర్, జీతభత్యాలు సమయానికి అందించబడతాయని హామీ ఇచ్చారు. అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం మునిసిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, కార్మికులకు పూర్తి రక్షణ, భద్రత, వసతులు అందించబడుతాయని మీడియా ద్వారా వెల్లడించారు.నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికుల కృషి, వారికి అందే గౌరవం మరియు శ్రద్ధ ప్రాముఖ్యత ఉన్నదని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమం ద్వారా మున్సిపల్ కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించడం, వారి జీవితాలను మెరుగుపరచడం, పట్టణ పరిరక్షణకు మద్దతుగా ఉండడం లక్ష్యంగా పెట్టబడినదని తెలిపారు.ప్రజాసేవలోనూ, పట్టణ పరిశుభ్రతలోనూ, మున్సిపల్ కార్మికుల పాత్ర అత్యంత ముఖ్యమైనదని, వారికి తగిన గౌరవం, మద్దతు ఇవ్వడం ప్రతి ప్రభుత్వ అధికారిగా, ప్రజాస్వామ్య బాధ్యతగా ఉందని తెలిపారు.

Sthanikam

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news