Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

మున్సిపల్ ఎన్నికలు ప్రిసైడింగ్ అధికారులకు ముమ్మర శిక్షణ

06-02-2026 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కమిషనర్ జి వెంకట్రాంరెడ్డి

చౌటుప్పల్ పురపాలక సంఘం రెండో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా,ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎన్నికల ముఖ్యఅధికారి రెవెన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అధికారులకు దిశానిర్దేశం చేశారు.మాస్టర్ ట్రైనర్స్ నరేందర్ రెడ్డి, దశరథ శిక్షణ ఇచ్చారు. మొత్తం 96 మంది ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.శిక్షణలో భాగంగా పోలింగ్ రోజున అధికారులు పాటించాల్సిన నిబంధనలు, ఓటింగ్ ప్రక్రియ నిర్వహణ,అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన, బ్యాలెట్ బాక్స్ సీలింగ్ మొదలైన విషయాలు క్షుణ్ణంగా వివరించారు.ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా,శాంతియుతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.సహాయ జిల్లా ఎన్నికల అధికారి,మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగింది.వారు మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల విధుల్లో అలసత్వం వహించరాదని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వీర బాయి, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఎంఈఓ గురువారావు, మున్సిపల్ ఆర్వో అంజయ్య, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, సానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, రేణు కుమార్ పర్యావరణ ఇంజనీర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికలు ప్రిసైడింగ్ అధికారులకు ముమ్మర శిక్షణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News