Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:48 AM

మున్సిపల్ ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించాలి

20-01-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

లౌకిక శక్తులతో కలిసి పోటీ – సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహ రెడ్డి భవన్‌లో నిర్వహించిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ, మండల పార్టీ కార్యదర్శుల సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో సిపిఎం పోటీ చేస్తుందని తెలిపారు. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో పార్టీ పోటీ చేసే స్థానాలపై చర్చ జరుగుతోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కలిసి వచ్చే లౌకిక పార్టీలను కలుపుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. అవసరమైతే జిల్లాలో తమకు బలమున్న స్థానాల్లో ఒంటరిగా కూడా పోటీ చేస్తామని పేర్కొన్నారు.

ప్రజా సమస్యలపై లోతైన అవగాహన కలిగి, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రజాసేవకే అంకితమయ్యే సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రజా సమస్యలపై గళమెత్తి, వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు.

ఎన్నికల్లో డబ్బు ప్రభావం అధికంగా ఉండటంతో సేవ చేసేవారు ఓటమి పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు డబ్బు, మద్యం ప్రభావం లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News