Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:19 PM

మున్సిపల్ ఎన్నికల్లో మాలలకు తగిన ప్రాధాన్యత కల్పించాలి.

మున్సిపల్ ఎన్నికల్లో మాలలకు తగిన ప్రాధాన్యత కల్పించాలి.

మున్సిపల్ ఎన్నికల్లో మాలలకు తగిన ప్రాధాన్యత కల్పించాలి.
January 29, 2026 09:17 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

మున్సిపల్ ఎన్నికల్లో మాలలకు తగిన ప్రాధాన్యత కల్పించాలి...

మూడు కౌన్సిల్,ఒక కోఆప్షన్ స్థానం కేటాయించాలని ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేత......

కోదాడ ప్రతినిధి హరీష్

మున్సిపల్ ఎన్నికల్లో మాలలకు మూడు కౌన్సిల్ ఒక కోఆప్షన్ స్థానం కల్పించాలని కోరుతూ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్ల పల్లి రవి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ని కోరారు. గురువారం కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి పిడతల శ్రీనుతో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందించారు. కోదాడ పురపాలక సంఘం ఏర్పడిన నాటి నుంచి మాలలకు ఎటువంటి ప్రాధాన్యత కల్పించలేదని తాము గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి ఎంతగానో సేవ చేశామని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ ప్రకారం తమకు రావాల్సిన వాటాలో అవకాశం కల్పించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ తప్పక అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పిడతల శ్రీను, లచ్చిమళ్ల రామ్మోహన్ రావు, గాదరి మధు, ప్రవీణ్ కుమార్, నాగరాజు, కొండలు, ఏసు, రాయప్ప, శంకర్ రావు, రమేష్, కృష్ణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News