Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తు

02-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రజా పాలనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ

-భువనగిరి,పోచంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపు మాదే : ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి

భువనగిరి పట్టణ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనీల్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీపీఐతో కలిసి పొత్తుతో బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒప్పందంలో భాగంగానే ఈ పొత్తు కొనసాగుతుందని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడంలో కమ్యూనిస్టులు ముందుంటారని, అలాంటి పార్టితో కలిసి ప్రజల తరఫున బలమైన పోరాటం చేస్తామని అన్నారు. భువనగిరి, భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలలో తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజారంజక పాలనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, ప్రజా పాలన–ప్రజా ప్రభుత్వం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో బృహత్తర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని అన్నారు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉందని పేర్కొన్నారు.(హెచ్ ఎం డి ఏ)పరిధిలోకి వచ్చాక భువనగిరి పట్టణానికి రూ.56 కోట్ల నిధులు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ హయాంలో జరగని అభివృద్ధిని కాంగ్రెస్ చేసి చూపిస్తోందని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలు ఇవన్నీ గమనించి రానున్న ఎన్నికల్లో సరైన తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News