Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

05-02-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకొస్తున్నాయని,

తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.సోమవారం కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. కోదాడ, హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలో క్లీన్ స్లిప్ సాధించబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.రూ. 13,600 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలో 3 కోట్ల 17 లక్షల మందికి ప్రతి నెలా 6 కిలోల ఉచిత సన్న బియ్యం అందిస్తున్నామని,ఇది మా ప్రభుత్వ ల్యాండ్‌మార్క్ – గేమ్ ఛేంజర్ స్కీమ్ అని,స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి ఇంత పెద్ద స్థాయిలో సన్న బియ్యం పంపిణీ జరుగుతోందని అన్నారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, కుటుంబ సభ్యులను చేర్చే అవకాశం కూడా కల్పించలేదు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అన్నారు.ఎలాంటి పైరవీలు లేకుండా, రాజకీయాలు లేకుండా, పార్టీ భేదం లేకుండా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నాం.200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్,ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం,మెరుగైన విద్య, వైద్య, మౌలిక వసతులు ప్రజలకు అందుతున్నాయని అన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల అభిప్రాయం చాలా స్పష్టం కాంగ్రెస్ తప్ప ఇతర పార్టీలకు ఓటేస్తే అది వృథా ఓటే అని అన్నారు.కాంగ్రెస్ కౌన్సిలర్లు, చైర్మన్‌లను గెలిపిస్తేనే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పట్టణాలకు మరింత నిధులు, మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.కోదాడ, హుజూర్‌నగర్, నేడ్చర్ల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ ఖాయం. కోదాడలో 35కి 35 వార్డులు, హుజూర్‌నగర్‌లో 28కి 28 వార్డులు,నేరేడుచర్లలో 15కి 15 వార్డులు కాంగ్రెస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకమైన, ప్రజాస్వామ్య పరిపాలన అందిస్తోంది.కుటుంబ పాలన నుంచి ప్రజా పాలన వైపు రాష్ట్రం ముందుకెళ్లింది అన్నారు.ఇటీవల మృతి చెందిన కర్ల రాజేష్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టంగా హామీ ఇచ్చారు.తెలంగాణ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే మా లక్ష్యం.కాంగ్రెస్ పార్టీతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆయన అన్నారు.తెలంగాణ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే మా లక్ష్యం.కాంగ్రెస్ పార్టీతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News