Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:51 PM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
February 04, 2026 06:50 PM 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అభివృద్ధి అడ్డుకునే వారికి కాదు… అభివృద్ధి చేసే వారికి ఓటు

సూర్యాపేట:

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యండి అంజద్ అలి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులకు దిశానిర్దేశ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అన్ని వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని స్పష్టం చేశారు. టికెట్ రాని వారు నిరాశ చెందవద్దని, పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి కట్టుబడి పనిచేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. తాము కూడా గతంలో పలుమార్లు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నా, సమీకరణాల దృష్ట్యా అవకాశం రాకపోయినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి అభ్యర్థుల విజయం కోసం పనిచేశామని గుర్తు చేశారు.

సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనపడిందని, పట్టణ ప్రజల చూపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపేనని అన్నారు. బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డికి అభ్యర్థులు దొరకక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినా, సూర్యాపేట పట్టణ అభివృద్ధిని విస్మరించారని, రంగురంగుల బ్రోచర్లలో మాత్రమే అభివృద్ధిని చూపించారని ఆరోపించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి ఆగకుండా కొనసాగుతోందని తెలిపారు. గత పది సంవత్సరాలలో గాలికి వదిలేసిన పనులను గాడిలో పెడుతున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన పాలన గతంలో జరిగిందని, అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని ఎక్కడా ఆపలేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం పేరుతో విధ్వంసం సృష్టించారని, రాష్ట్రాన్ని దోపిడీ చేశారని తీవ్రంగా విమర్శించారు.సూర్యాపేట పట్టణంలో ప్రతి గల్లీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, ఇంకా ఇల్లు లేని వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఐదేళ్లలో సూర్యాపేట పట్టణానికి అత్యధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆపద వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నామని, అనేక మందికి ఆసుపత్రుల్లో చికిత్స కోసం అనుమతులు ఇచ్చామని చెప్పారు.పట్టణ ప్రజల కష్టసుఖాల్లో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వార్డు అభివృద్ధి బాధ్యత పూర్తిగా తమదేనని పేర్కొన్నారు. అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, మున్సిపల్ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీకి వేయాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే పట్టణ అభివృద్ధి వేగంగా సాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రాజా, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News