Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:31 AM

మున్సిపల్ ఎన్నికల్లో అసలైన బీసీలకే బీసీ రిజర్వేషన్లు చెందాలి

31-01-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు మరోసారి అన్యాయం

30 శాతం లోపలే రిజర్వేషన్లతో బీసీలకు నష్టం:56 శాతం రిజర్వేషన్ కల్పించాలి

- బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఆరు మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లను ఉద్దేశించి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి ఒక ప్రకటనలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న భువనగిరి,భూదాన్ పోచంపల్లి,యాదగిరిగుట్ట,ఆలేరు,మోత్కూర్ మున్సిపాలిటీలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అసలైన బీసీలకే తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు తగిన న్యాయం చేయలేదని విమర్శించారు.ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా కేవలం 30 శాతం లోపలే రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీలను రాజకీయంగా మరింత వెనక్కి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇతర కులమతాలకు చెందిన వారితో ప్రేమ వివాహాలు చేసుకున్న వారు కూడా బీసీ మహిళా రిజర్వేషన్లను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ,తరతరాలుగా బీసీ కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నిజమైన బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేస్తున్నారని అన్నారు.బీసీల రాజకీయ,సామాజిక అభివృద్ధి సాధ్యమవ్వాలంటే ప్రభుత్వం వెంటనే 56 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ అంశంపై ప్రభుత్వాలు,రాజకీయ పార్టీలు మరోసారి గంభీరంగా ఆలోచించాలని కోరారు. బీసీలకు న్యాయం జరగకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల్లో అసలైన బీసీలకే బీసీ రిజర్వేషన్లు చెందాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News