Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:51 AM

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
February 10, 2026 06:38 PM 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించాలి

జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఈ నెల 11వ తేదీ బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి తీసుకురావాలని సూచించారు. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫోటోతో కూడిన పోస్టాఫీస్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, కార్మిక గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ ద్వారా జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు లేదా ఇతర అధికారిక గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు.

ప్రతి ఓటరు తన ఓటు హక్కును వంద శాతం వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పాటు అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలోని నూట నలభై ఒకటి వార్డుల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు.పోలింగ్ నిర్వహణకు నాలుగు వందల నలభై ఆరు పోలింగ్ అధికారులు, నాలుగు వందల నలభై ఆరు సహాయ పోలింగ్ అధికారులు, వెయ్యి మూడు వందల నలభై మంది ఓపిఓలను నియమించినట్లు చెప్పారు. ఎన్నికల సజావు నిర్వహణకు యాభై ఒకరు జోనల్ అధికారులు, నలభై ఆరు రూట్ అధికారులను నియమించామని తెలిపారు. స్వేచ్ఛాయుత, న్యాయబద్ధ ఎన్నికల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఎన్నికల సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు, తిరిగి స్ట్రాంగ్ రూములకు తరలింపుకు నలభై ఆరు బస్సులు సిద్ధం చేశామని, పోలీసు ఎస్కార్టుతో పూర్తి భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు.

అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జనరల్ పరిశీలకుడు పాండదాస్‌తో కలిసి ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News