Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 03:12 AM

మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
08-02-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ చర్యలు

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ తెలిపారు. ఈనెల 11వ తేదీన సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో జరగనున్న రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఐదు మున్సిపాలిటీ కేంద్రాలలో మొత్తం 141 వార్డులకు గానూ 372 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటిలో 115 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల కోసం 1250 మంది పోలీసు సిబ్బందితో రక్షణ బందోబస్తు నిర్వహణకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పటిష్ట నిఘా కొనసాగుతోందని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ఉచితాలు, బహుమతులు, డబ్బు, మద్యం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకసారి ఎన్నికల కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు తప్పవని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రచార సమయం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని, ఆ తర్వాత ఎవ్వరూ ప్రచారం చేయరాదని తెలిపారు. స్థానికేతరులు, ఓటర్లు కానివారు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉండకూడదని సూచించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని కోరారు.ఎన్నికల నిర్వహణలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని, ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ బాధ్యతలతో నియమించామని, ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ విధులు నిర్వహిస్తుందని వెల్లడించారు.ఓటర్లు స్వేచ్ఛగా, భయరహితంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ పిలుపునిచ్చారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News