Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:33 PM

మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలొ ముఖ్య అతిధిగా పాల్గొన్నచిరుమర్తి లింగయ్య

19-01-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. చిట్యాలలోని ముప్పా మల్లారెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని వార్డుల వారీగా పలువురు ఇంచార్జిలను ఆయన నియమించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో ఇంటింటి ప్రచారం ముమ్మరం చేయడంతో పాటు ప్రజా సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారంపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని సూచించారు. బి ఆర్ఎస్ ప్రభుత్వo చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని, పార్టీపై ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని లింగయ్య సూచించారు. క్రమశిక్షణతో కూడిన సమన్వయపూర్వక కార్యాచరణతోనే ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుందన్నారు.o

ఈ సమావేశంలో పార్టీ నాయకులు, సీనియర్ కార్యకర్తలు, యువ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాబోయే ఎన్నికలపై చర్చించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికపై ఈ సమావేశం దిశానిర్దేశం చేసినట్లు నేతలు తెలిపారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలొ ముఖ్య అతిధిగా పాల్గొన్నచిరుమర్తి లింగయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News