Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి

12-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- కలెక్టర్ హనుమంతరావు

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించిన అధికారులకు,సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రాథమిక మరియు వివరాత్మక కౌంటింగ్ నిర్వహించాలని,రూల్ 56 ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని తెలిపారు. అలాగే యాక్ట్ 212 ప్రకారం గోప్యత (సీక్రసీ) పరిరక్షణను ఖచ్చితంగా పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను కౌంటింగ్ ఏజెంట్లకు స్పష్టంగా చూపించి, సంబంధిత అభ్యర్థి ట్రేలో సక్రమంగా వేయాలని ఆదేశించారు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా,నియమ నిబంధనలకు అనుగుణంగా జరగాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ...కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు,సలహాలు జారీ చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్‌కు ఒక సూపర్వైజర్,ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను నియమిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ నిర్వహించి,ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి,డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి,మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి,హరినాథ్ రెడ్డి,కౌంటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News