Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:44 AM

మున్సిపల్ చైర్మన్ ల ఎంపికలో అన్ని పార్టీలు సామాజిక న్యాయం పాటించాలి

మున్సిపల్ చైర్మన్ ల ఎంపికలో అన్ని పార్టీలు సామాజిక న్యాయం పాటించాలి

మున్సిపల్ చైర్మన్ ల ఎంపికలో అన్ని పార్టీలు సామాజిక న్యాయం పాటించాలి
February 14, 2026 08:39 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

కౌన్సిలర్లు బీసీలు అయితే.. చైర్మన్ లుగా అగ్రకులాలకు అవకాశం కల్పిస్తే సహించేది లేదు...?

జనరల్ స్థానాలు అంటే రెడ్డి, రావులకు రిజర్వేషన్ కాదు...??

జనరల్ స్థానాలలో కూడా మున్సిపల్ చైర్మన్ లుగా బీసీలకు అవకాశం కల్పించాలి..???

జనరల్ స్థానాలలో బీసీలు అత్యధిక సంఖ్యలో గెలవడం బీసీల ఐక్యతకు నిదర్శనం

మున్సిపల్ ఎన్నికలలో 60 శాతం బీసీలే గెలవడం అభినందనీయం

మున్సిపల్ చైర్మన్ లుగా, మేయర్ లు గా 60 శాతం బీసీలకు ఇవ్వాల్సిందే

కాంగ్రెస్ 60,బిఆర్ఎస్ 10 చైర్మన్ స్థానాలు బీసీలకు కట్టబెట్టాలి

మెజార్టీగా 60శాతం బీసీలు కౌన్సిలర్ గా, కార్పొరేటర్ గా ఎన్నికైతే.. దామాషా ప్రకారం 60 శాతం చైర్మన్ లు బీసీలకు ఎందుకు ఇవ్వరు..?

ఎవరి వాటా వాళ్లకు దక్కలన్న రాహుల్ గాంధీ సూత్రాన్ని కాంగ్రెస్ అమలు చేయాలి

అగ్రకుల ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గలలో తమ సొంత కులనేతలకు చైర్మన్ లుగా అవకాశం కల్పించాలని చూస్తే సహించo

భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా బీసీలకు ఇవ్వాల్సిందే

చాలా నియోజకవర్గాల్లో ఒకటి రెండు అగ్రకులాలు గెలిచిన చోట మున్సిపల్ చైర్మన్ లుగా వారికి అవకాశం కల్పించాలని చూస్తే ఆ ఎమ్మెల్యేలను బీసీ ద్రోహులుగా ప్రకటిస్తాం..?

బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

ఈనెల 16వ తేదీన రాష్ట్రంలో జరగనున్న 116 మున్సిపల్ చైర్మన్ లు, ఏడు కార్పొరేషన్ మేయర్ ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు బీసీలకు జనాభా దామాషా ప్రకారం చైర్మన్ లుగా అవకాశం కల్పించి సామాజిక న్యాయం పాటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.నేడు భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఈనెల 11వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేసి మొత్తంగా 60 శాతం మంది బీసీలు కౌన్సిలర్గా కార్పొరేటర్ గా విజయం సాధించారని ఇది బీసీల రాజకీయ చైతన్యానికి నిదర్శనమని ఆయన కొనియాడారు. ఇదే సమయంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంతా కలిసి మెజార్టీగా 85శాతం విజయం సాధించారని, అగ్రకులాలు అన్ని పార్టీల్లో కలిపి 15శాతం విజయం సాధించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ సుమారు 85 మున్సిపాలిటీలలో, టిఆర్ఎస్ పార్టీ 15 మున్సిపాలిటీలలో, బిజెపి 2 ఎంఐఎం ఒకటి అందులో 14 విజయం సాధించారని, కాంగ్రెస్ బీసీలకు 60 మున్సిపల్ చైర్మన్ లుగా, బిఆర్ఎస్ 10 చైర్మన్లుగా,బీసీలకు అవకాశం కల్పించాలని అలాగే 7 మేయర్ ఎంపికలలో బీసీలకు నాలుగు మేయర్ స్థానాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణలో బీసీలు 56 శాతంపైగా ఉన్నారని తేలిపోయిందని జనాభా ప్రకారం మేయర్ లుగా, మున్సిపల్ చైర్మన్ లుగా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నచోట బీసీలకు వైస్ చైర్మన్,డిప్యూటీ మేయర్ గా అవకాశం కల్పించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో జనరల్ స్థానాలు అనగానే కేవలం రెడ్డి,రావులకే రిజర్వేషన్ అయినట్టు చూస్తున్నారని, రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలలో 90 శాతం బడుగులకు చెందిన కౌన్సిలర్లు గెలుపొందితే,ఒక్కరు ఇద్దరు ముగ్గురే అగ్రకులాలు గెలిచారని, 90 శాతం ఉన్న వారిని కాదని 9శాతం ఉన్న అగ్రకులాలకు మున్సిపల్ చైర్మన్ లుగా అన్యాయంగా కట్టబెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో చాలామంది అగ్రకుల ఎమ్మెల్యేలు తమ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఒకరిద్దరు గెలిచిన వారిని మున్సిపల్ చైర్మన్ చేయాలని విఫల ప్రయత్నం చేస్తున్నారని కానీ వాళ్ళ ఆటలు సాగనివ్వమని,ఈ దామాషా పద్ధతిలో ఎవరి వాటా వారికే తగ్గాలన్న రాహుల్ గాంధీ సూత్రాన్ని మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,సీఎం రేవంత్ రెడ్డి లు వెంటనే జోక్యం చేసుకొని సామాజిక న్యాయం పాటించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు, బీసీలకు అన్యాయం చేసే పార్టీలను బీసీ ద్రోహులుగా ప్రకటించి వారి కార్యాలయాలను ముట్టడిస్తామని ఎమ్మెల్యేలు అన్యాయం చేస్తే వారిని బీసీ జాతి ద్రోహులుగా ప్రకటించి వచ్చే ఎన్నికలలో బీసీల ఓటును వారికి లేకుండా రాజకీయ భూస్థాపితం చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రధానంగా భువనగిరి మున్సిపల్ ఎన్నికలలో 35 వార్డులలో ఒక్క రెడ్డి తప్ప మిగతా 34 చోట్ల బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ అభ్యర్థుల విజయం సాధించారని కానీ స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి బీసీలకు కాదని ఒక్కరే గెలిచిన రెడ్డికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని తెలుస్తుందని ఇదే గనక జరిగితే అనిల్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో భువనగిరి గడ్డ నుంచి తరిమికొడతామని జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు.ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి,కార్యనిర్వాక అధ్యక్షులు బాబురావు,నియోజకవర్గ అధ్యక్షులు సాబన్ కార్ వెంకటేష్,బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్,బీసీ రాష్ట్ర నాయకులు బత్తిని రాజు గౌడ్,జాజుల లింగం,వెంకన్న, రమేష్ యాదవ్,వెంకటేష్ గౌడ్,ఇంద్రం రజక,భువనగిరి మండల అధ్యక్షులు జిన్నమల్లేష్ ముదిరాజ్,యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు అశోక చారి,మోహన్,రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News