Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:28 AM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నల్లగొండ ఎస్పీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

20-01-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నల్లగొండ స్థానికం ప్రతినిధి దాస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉండటంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ, నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సోమవారం జిల్లా ఎస్పీని వారి కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అవమానించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని “బొంద పెట్టాలి”, పార్టీ జెండా దిమ్మెలు కూల్చివేయాలంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఆందోళనను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఇవి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమే కాకుండా శాంతి భద్రతలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, నోముల భగత్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లికార్జున రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కొండూరు సత్యనారాయణ, సయ్యద్ జాఫర్ జమల్ ఖాద్రి తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నల్లగొండ ఎస్పీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News