Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:32 AM

ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్న వేముల వీరేశం. జన్మదినం సందర్భంగా పలువురు మంత్రులను కలిసిన ప్రభుత్వ విప్

01-06-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తన జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులు చూపుతున్న అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.

నకిరేకల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నాయకులు అలుగుబెల్లి రవీందర్ రెడ్డి, దుబ్బాక నరసింహారెడ్డి, బండ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్న వేముల వీరేశం. జన్మదినం సందర్భంగా పలువురు మంత్రులను కలిసిన ప్రభుత్వ విప్

Article Image

నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తన జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులు చూపుతున్న అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.

నకిరేకల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నాయకులు అలుగుబెల్లి రవీందర్ రెడ్డి, దుబ్బాక నరసింహారెడ్డి, బండ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News