Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

ముగజీవాల సేవలోనే కాదు దానగుణం లోనూ తాము సైతం అంటూ

ముగజీవాల సేవలోనే కాదు దానగుణం లోనూ తాము సైతం అంటూ

ముగజీవాల  సేవలోనే కాదు  దానగుణం లోనూ తాము సైతం అంటూ
April 05, 2026 11:03 AM 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

పశు ఔషధ బ్యాంక్ నకు పది వేల విరాళం అందించిన పశువైద్యులు

కోదాడ పట్టణం ప్రాంతీయ పశువైద్యశాలలో డా మాడుపల్లి రవికుమార్, డా .అఖిల దంపతులు , పశువైద్యంలో పశు పోషకులకు చేయూతనిస్తున్న పశు ఔషధ బ్యాంక్ కోసం పదివేల రూపాయల విరాళాన్ని, రంగారెడ్డి జిల్లా పశువైద్య మరియు పశు సంవర్ధక శాఖ , జాయింట్ డైరెక్టర్ డా.డి. శ్రీనివాసరావు చేతుల మీదుగా అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్యకి అందించారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ మాట్లాడుతూ , నడిగూడెం మండలంలో పశువైద్యులుగా మూగజీవాలకు సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందిన పశువైద్యాధికారులు డా .యం రవికుమార్, డా. అఖిల దంపతులు అన్నారు. ప్రాణం విలువ తెలిసిన వారు, అందులోనూ, నోరులేని జంతువుల పట్ల అమితమైన ప్రేమాభిమానాలు కలిగిన వీరు పశువైద్యంలోనే కాదు పశుప్రాణ రక్షణకు అవసరమైన పశు ఔషధాల విరాళం లోనూ ముందుండే సంకల్పం వారి స్వంతం అన్నారు. తన తండ్రి కీ శే. మాడుపల్లి సూర్యప్రకాశ్ వర్ధంతి పురస్కరించుకొని వారిజ్ఞాపకార్డం పదివేల రూపాయలను కోదాడ పశు ఔషధ బ్యాంక్ నకు విరాళంగా అందించి జంతువుల పై ప్రేమ తమ తండ్రిపై గౌరవం చూపించడం అభినందనీయమని అన్నారు.

పశు ఔషధ బ్యాంక్ సేవలను గతంలో దగ్గర ఉండి చూశానని, నిస్వార్థ సేవలతో నిర్వహిస్తున్న పశు ఔషధ బ్యాంక్ పశుపోషకులకు కోట్ల రూపాయల అదనపు సంపదను సృష్టిస్తున్న సేవలను జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర అధికారులు ప్రశంసిస్తున్నారని అన్నారు.


కోదాడ పశు ఔషధ బ్యాంక్ స్ఫూర్తితో రంగారెడ్డి జిల్లాలో సైతం పశుపోషకుల కోసం దాతల సహకారంతో పశు ఔషధ బ్యాంక్ ల ఏర్పాటుకు కృషిచేస్తున్నామని తెలిపారు

కార్యక్రమం లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన వివిధ మండలాల పశువైద్యులు, డా వీరారెడ్డి, డా .శిరంశెట్టి కిరణకుమార్ డా జయసుధ, డా. శ్రీకాంత్, డా వెంకన్న డా మమత, డా శ్రావణి, డా రవికుమార్, డా శైలజ, సిబ్బంది సాయికృష్ణ, చిరంజీవి కర్ణ , రాజేష్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News