Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:52 AM

ముగ్గురు కొడుకులున్నా ఆకలితో విలవిలలాడుతున్న వృద్ధ తల్లి

03-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బుక్కెడు అన్నం కోసం ఎదురుచూస్తున్న 95 ఏళ్ల వెంకమ్మ

కొడుకులకు బుద్ధి చెప్పి ఆదుకోవాలని అధికారులకు వేడుకోలు

సూర్యాపేట: మోతే మండలం నామవరం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ ఓ వృద్ధ తల్లి బుక్కెడు అన్నం కోసం ఎదురుచూస్తూ నిస్సహాయ స్థితిలో జీవిస్తోంది.

గ్రామానికి చెందిన నల్లగంతుల వెంకమ్మ (95) భర్త మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఆమెకు పాపయ్య, వెంకన్న, ఎల్లయ్య అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. తండ్రి మరణానంతరం తల్లిని చూసుకుంటామని చెప్పిన కుమారులు, ఆమె పేరుమీద ఉన్న మూడు ఎకరాల తొమ్మిది గుంటల భూమిని తమ పేర్లకు మార్చించుకున్నారు. అనంతరం తల్లిని పట్టించుకోకుండా ఒంటరిగా వదిలేశారు.

ఆకలితో అలమటిస్తున్న వెంకమ్మ స్థానికుల సహాయంతో జిల్లా కేంద్రంలోని ఆదాయ విభాగాధికారిని సంప్రదించింది. స్పందించిన అధికారి ముగ్గురు కుమారులను పిలిపించి ప్రతి ఒక్కరు నెలకు పదిహేనువందల రూపాయలు చొప్పున తల్లికి ఇవ్వాలని ఆదేశించారు. అయినప్పటికీ ఆ ఆదేశాలను పట్టించుకోకుండా కుమారులు వెళ్లిపోయినట్లు సమాచారం.

దిక్కుతోచని స్థితిలో కుమార్తె వద్దకు వెళ్లిన వెంకమ్మ, ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో నడుము విరిగి మరింత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కుమార్తె కూడా పోషణలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.

తనకు బుక్కెడు అన్నం పెట్టాలని, కొడుకులకు బుద్ధి చెప్పి తగిన న్యాయం చేయాలని వెంకమ్మ స్థానికులు, జిల్లా కలెక్టర్ సహా సంబంధిత అధికారులను వేడుకుంటోంది.

Sthanikam

ముగ్గురు కొడుకులున్నా ఆకలితో విలవిలలాడుతున్న వృద్ధ తల్లి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News