Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:07 PM

ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలని డిమాండ్

ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలని డిమాండ్

ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలని డిమాండ్
18-05-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గంగపుత్రుల వ్యాఖ్యలను ఖండించిన దేప శ్యాంసుందర్ ముదిరాజ్

మేనిఫెస్టో హామీ అమలు చేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి

ముదిరాజ్ కులస్తులను బీసీ-ఏలో చేర్చవద్దంటూ గంగపుత్ర సంఘం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ముదిరాజ్ మహాసభ జిల్లా నాయకులు దేప శ్యాంసుందర్ ముదిరాజ్ అన్నారు. ముదిరాజులను బీసీ-ఏలో చేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఓర్వలేక కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.తమకు కావాల్సిన హక్కులను ఎవరైనా కోరవచ్చని, అయితే ఇతర వర్గాల హక్కులను అడ్డుకునే విధంగా ప్రకటనలు చేయడం తగదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు.ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జనాభా గణాంకాల్లో ముదిరాజులే అధిక సంఖ్యలో ఉన్నట్లు తేలిందన్నారు. తాము కొత్తగా ఏమీ కోరడం లేదని, ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని తెలిపారు.ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను ముదిరాజ్ ఐక్య సంఘాల నాయకులు కలిసి సమస్యను వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. బీసీ-ఏ అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సమయంలో గంగపుత్ర సంఘాలు సమావేశాలు, ప్రెస్‌మీట్లు నిర్వహించడం సరికాదన్నారు.

ముదిరాజుల హక్కుల సాధన కోసం అన్ని ముదిరాజ్ సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని, ఇలాంటి ప్రకటనలను సమష్టిగా ఖండించాలని దేప శ్యాంసుందర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో దేప మత్య్సగిరి, గుండ్ల లింగస్వామి, సత్యబోయిన మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలని డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News