Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

మోటకొండూరులో నాయి బ్రాహ్మణ మహనీయుల క్యాలెండర్ ఆవిష్కరణ

19-03-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోటకొండూరు:ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భారతదేశంలోని నాయి బ్రాహ్మణ (మంగలి) మహనీయుల చరిత్ర,సేవలను స్మరించుకునే ఉద్దేశంతో రూపొందించిన నాయి బ్రాహ్మణ మహనీయుల క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మోటకొండూరు సర్పంచ్ భూమండ్ల జయమ్మ-శ్రీనివాస్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఈ క్యాలెండర్‌ను రిటైర్డ్ తహసీల్దార్ వి. బాలరాజు ప్రత్యేకంగా ప్రచురించారు. కార్యక్రమానికి హాజరైన పలువురు నాయకులు,సామాజిక ప్రతినిధులు ఈ క్యాలెండర్‌ను నాయి బ్రాహ్మణ సమాజ చరిత్ర, గౌరవం, సేవా సంప్రదాయాలను కొత్త తరానికి పరిచయం చేసే ఒక ప్రాముఖ్యమైన ప్రయత్నంగా అభివర్ణించారు.ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ మండల అధ్యక్షుడు జంపాల నాగచందర్ మాట్లాడుతూ,

“భారతరత్న జననాయక్ కర్పూరి ఠాకూర్ వంటి మహనీయుల పేరు ప్రస్తావన లేకుండా నేటి సామాజిక చర్చలు పూర్తికావు. సమాజ గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులను స్మరించుకోవడం,వారి సేవలను తరతరాలకు పరిచయం చేయడం మన అందరి బాధ్యత” అని పేర్కొన్నారు.

మోటకొండూరు సర్పంచ్ భూమండ్ల జయమ్మ-శ్రీనివాస్ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా నాయి బ్రాహ్మణ సమాజానికి చెందిన అనేక మంది మహనీయులు రాజకీయ,సామాజిక, విద్యా రంగాల్లో విశిష్ట సేవలు అందించారని తెలిపారు.భారతరత్న జననాయక్ కర్పూరి ఠాకూర్,ముత్తువేళ్ కరుణానిధి,ఎం.వీరప్ప మొయిలీ వంటి నాయకులు వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా సేవలందించి తమదైన ముద్ర వేశారని గుర్తుచేశారు.వారితో పాటు ఉద్యమాల ఉపాధ్యాయుడు సాంబశివరావు బహుజనులకు మార్గదర్శిగా నిలిచి,ఎన్నో ఉద్యమాలకు ఊపిరి అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని వారిని స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బుగ్గ కొమురయ్య,జంపాల మహేష్, జంపాల భాస్కర్,జంపాల శ్రీనివాస్,జంపాల ఆత్మరావు,జంపాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.అలాగే మోటకొండూరు పాలకవర్గ సభ్యులు,నాయి బ్రాహ్మణ సోదరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

మోటకొండూరులో నాయి బ్రాహ్మణ మహనీయుల క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News