Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:29 AM

మూసీ జల కాలుష్యం నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలి

18-01-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ డిమాండ్.

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

మూసీ జల కాలుష్యంను అరికట్టి మూసీ ఆయకట్టు ప్రాంతాన్నికి ప్రత్యామ్నాయంగా గోదావరి, కృష్ణ జలాలు అందించి కాలుష్యం నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఆదివారం పోచంపల్లి మండల పరిధిలోని పిల్లాయిపల్లి సిపిఎం గ్రామ శాఖ సమావేశం పార్టీ కార్యాలయంలో జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని మూసీ విషపు నీరు కమ్మేసిందని, ఏళ్ల తరబడి గత్యంతరం లేక ప్రజలు ఈ నీటిని వాడుతూ పంటలు పండిస్తున్నారని దానితో బువ్వ పెట్టే భూమే విషయమౌతుందని ఆవేదన చెందారు. మరో వైపు ప్రజారోగ్యము, పశు, మత్స్య సంపద, జీవజాలం యొక్క మనగడు ప్రశ్నార్ధంగా మారిందని తెలిపారు. మూసీ నీళ్లు కాలుష్యంతో అనేక రకాలైన జబ్బులు, చర్మవ్యాధులు, క్యాన్సర్ లాంటి రకరకాల రోగాల బారిన పడి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. 40 ఏళ్ల క్రితం తాగునీటి అవసరాలు తీర్చిన మూసీ నది ఇప్పుడెందుకు మురికి కోపంగా మారిందో పాలకులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు ? మూసీ పరివాహక ప్రాంతం వెంట 12 వేలకు పైగా పరిశ్రమలు ఉన్నాయని ఆ పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యం, వ్యర్దపదార్థాలతో మూసీ కాలువ మురికి కూపంగా, డంపింగ్ యార్డ్ గా మార్చారని దీనిని నివారించవలసిన పాలకులు ఓట్ల రాజకీయం తప్ప ప్రజల ఆరోగ్యం పట్టడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం మూసీ ప్రక్షాళనలకు, కాలుష్య నివారణకు తగు చర్యలు చేపట్టాలని, ప్రత్యామ్నాయంగా గోదావరి, కృష్ణ జలాలను అందించాలని నర్సింహ డిమాండ్ చేసినారు. ఈ సమావేశానికి పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యులు గూడూరు బుచ్చిరెడ్డి అధ్యక్షత వహించగా ఇంకా సిపిఎం సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శివర్గ సభ్యులు మంచాల మధు, శాఖ కార్యదర్శి పత్తి బిక్షపతి, గ్రామ నాయకులు అందెల యాదగిరి, అశోక్, బాత్క బిక్షపతి, కంజర్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మూసీ జల కాలుష్యం నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News