Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

మూడవ వార్డులో ఊపందుకున్న బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

07-02-2026 175 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ 3వ వార్డులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శేపురి జయమ్మకు మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఉదయం నుంచే వార్డు పరిధిలోని పలు వీధుల్లో తిరుగుతూ ఓటర్లను నేరుగా కలుసుకున్నారు. ఇంటింటా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై వివరించారు. స్థానిక సమస్యలను మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ సమస్యలను నేతల దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన చిరుమర్తి లింగయ్య సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రజల స్పందన ఉత్సాహంగా ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నేతలు ప్రజలను కోరారు.

Sthanikam

మూడవ వార్డులో ఊపందుకున్న బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News