Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

మోడీ–ట్రాంపు చీకటి వాణిజ్య ఒప్పందం అనైతికం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి

10-02-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారత వ్యవసాయ రంగాన్ని అమెరికాకు తాకట్టు పెడుతున్న బీజేపీ ప్రభుత్వం

సిపిఎం ఆధ్వర్యంలో నిరసనగా మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

రామన్నపేట,

అమెరికాతో చీకటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని భారత వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం ట్రాంపుకు తాకట్టు పెడుతోందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య తీవ్రంగా విమర్శించారు.సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ స్థానిక సుభాష్ సెంటర్ వద్ద మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మధ్యంతర వాణిజ్య ఒప్పందం వల్ల ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడంతో సోయాబీన్, మొక్కజొన్న రైతులకు గడ్డు రోజులు తప్పవని అన్నారు.

ఐదు వందల బిలియన్ డాలర్ల వ్యాపారం పేరిట దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతోందని, తక్కువ ధరలకు చమురు ఇస్తున్న దేశాల నుంచి కొనుగోళ్లను ఆపివేయడం దుర్మార్గమని విమర్శించారు. దేశంలోకి వచ్చే విదేశీ వస్తువులపై సుంకాలు తగ్గించడం వల్ల భారత రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికుల జీవనం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.

ఢిల్లీ రైతు ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కి దేశ ప్రజలను మోసం చేస్తోందని, ఎరువులపై సబ్సిడీలు తగ్గించి ధరలు పెంచుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. స్వదేశీ నినాదాలు చేసే కేంద్ర బీజేపీ ప్రభుత్వం విదేశీ శక్తులకు మోకరిస్తోందని, దీనికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యుడు బల్గురి అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్, కందుల హనుమంతు, మండల నాయకులు గన్నేబోయిన విజయభాస్కర్, నీల అయిలయ్య, ఆవనగంటి నగేష్, గంటెపాక శివకుమార్, మునికుంట్ల లెనిన్, శానగొండ రాము, బడుగు రమేష్, అంబటి సురేందర్ రెడ్డి, నకిరేకంటి సురేష్, గాదె కృష్ణ, తుర్కపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

మోడీ–ట్రాంపు చీకటి వాణిజ్య ఒప్పందం అనైతికం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News