Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:35 AM

మంథని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం కలకలం – ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

21-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పెద్దపల్లి జిల్లా మంథనిలోని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం వ్యవహారం వెలుగుచూసి సంచలనం సృష్టించింది. మంథనిలో సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న కాసర్ల రాజేందర్ భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి ఫిర్యాదుదారుడి వద్ద నుంచి రూ.16,500 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఫిర్యాదుదారుడు కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ ఫైల్‌ను ముందుకు పంపేందుకు, ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ రషీద్ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా అధికారులు రంగంలోకి దిగారు. ముందస్తు సమాచారంతో పన్నాగం రచించిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు కార్యాలయంలో దాడి చేసి, లంచం స్వీకరిస్తున్న సమయంలోనే రాజేందర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీ అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం కార్యాలయ రికార్డులను పరిశీలించి, సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భూముల రిజిస్ట్రేషన్ వంటి సాధారణ ప్రజా సేవలకు కూడా లంచాలు డిమాండ్ చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు వరుసగా వెలుగులోకి రావడం ప్రజల్లో ఆందోళనకు దారితీస్తోంది.

ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు. సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Sthanikam

మంథని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం కలకలం – ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News