Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

మంచి ఫలితాల కోసం సమయాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్ పి. ప్రావీణ్య

19-02-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చదువుపై పూర్తి ఏకాగ్రతతో దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సూచించారు. పరీక్షల సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు.గురువారం కలెక్టర్ పుల్కల్ మండలం గొంగ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు సింగూర్ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల విద్యాభ్యాసం, సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. గొంగ్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో తరగతి గదులు, వాష్ రూములు, పాఠశాల ఆవరణ తదితరాలను పరిశీలించిన ఆమె, విద్యార్థులతో మమేకమై మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. భోజన నాణ్యత, మెనూ వివరాలను తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.ప్రత్యేకంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, రోజువారీ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా, స్నాక్స్ అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రత్యేక తరగతులు సక్రమంగా జరుగుతున్నాయని, అవసరమైన స్నాక్స్ అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరీక్షలు సమీపిస్తున్నందున ప్రతి రోజూ పునరావృతం చేసుకుంటూ పాఠ్యాంశాలపై పట్టు సాధించాలని, అనుమానాలు ఉంటే వెంటనే ఉపాధ్యాయులను సంప్రదించాలని సూచించారు. లక్ష్యసాధనకు క్రమబద్ధమైన ప్రణాళికతో ముందుకు సాగాలని హితవు పలికారు.అయితే పాఠశాలలోని మరుగుదొడ్ల శుభ్రతపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిరోజూ మరుగుదొడ్లు శుభ్రం చేయాలని, పరిశుభ్రతలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రమైన వాతావరణం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.అనంతరం సింగూర్ గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్ తరగతి గదులను పరిశీలించి విద్యార్థులను పలకరించారు. పాఠ్యాంశాల పురోగతిపై ప్రశ్నించి సిలబస్ పూర్తిచేసి పునరావృతం ద్వారా మెరుగైన ప్రతిభ కనబర్చాలని సూచించారు. చిన్న వయసు నుంచే ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని కృషి చేస్తే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగవచ్చని ప్రోత్సహించారు.తదుపరి బస్వాపూర్ గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల” పనుల పురోగతిని సమీక్షించారు. పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తహసీల్దార్, పంచాయతీ సెక్రటరీ, పోలీస్ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మంచి ఫలితాల కోసం సమయాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్ పి. ప్రావీణ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News