Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:04 PM

మీసేవ కేంద్రంలో అధిక ఫీజుల వసూళ్లు… టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు

07-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వినియోగదారుల ఫిర్యాదులపై అధికారుల దృష్టి

నల్గొండ జిల్లాలోని నార్కెట్‌పల్లి పట్టణంలో ఉన్న ఓ మీసేవ కేంద్రంపై అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.ఈ దాడుల్లో భాగంగా నల్గొండ కలెక్టరేట్‌కు చెందిన దుర్గారావు ఈడీఎం, నార్కెట్‌పల్లి తహసీల్దార్ ఎల్. వెంకటేశ్వర్ రావు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె.వి. తరుణ్ తదితర అధికారులు పాల్గొన్నారు. మీసేవ కేంద్రంలో సేవలు పొందుతున్న ప్రజల నుండి ప్రత్యక్షంగా వివరాలు సేకరించారు. అదేవిధంగా ఫిర్యాదు చేసిన వ్యక్తిని పిలిపించి విచారణ జరిపారు.తనిఖీల సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించిన రుసుముల కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర నిర్వాహకులకు అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయించిన ధరలకంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఫిర్యాదుదారులు, వినియోగదారులు మరియు కేంద్ర సిబ్బంది నుండి సేకరించిన సమాచారంతో సమగ్ర నివేదికను తయారు చేసి జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.ఇకపై మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన రుసుములే చెల్లించాలని వినియోగదారులకు సూచించారు. ఎక్కడైనా అధిక వసూళ్లు జరిగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

నార్కెట్‌పల్లి పట్టణంలోని "నాని నెట్ సెంటర్" పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జరిగిన ఈ తనిఖీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. నిర్వాహకురాలు శోభా రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రంపై తదుపరి చర్యలపై అధికారుల నివేదిక అనంతరం స్పష్టత రానుంది.

Sthanikam

మీసేవ కేంద్రంలో అధిక ఫీజుల వసూళ్లు… టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News