మేకకు శస్త్రచికిత్స.. ప్రాణాలు కాపాడిన వైద్యులు
చింతలపాలెం మండలం దొండపాడులో నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన మేకకు గర్భాశయం బయటకు వచ్చి తీవ్ర రక్తస్రావమైంది. యజమాని వెంటనే కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తరలించగా, డాక్టర్ పి. పెంటయ్య నేతృత్వంలో వైద్య బృందం శస్త్రచికిత్స నిర్వహించింది. గర్భాశయాన్ని శుభ్రపరిచి, తిరిగి కడుపులోకి చేర్చి మేక ప్రాణాలను కాపాడారు. ఈ క్లిష్టమైన సర్జరీలో సిబ్బంది రాజు, ప్రశాంత్ పాల్గొని వైద్యునికి సహకరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి