Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

మే డే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు అవసరం: మాయ కృష్ణ

02-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,: మే డే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ పిలుపునిచ్చారు. మే డే సందర్భంగా విలేకరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

శనివారం భువనగిరి పట్టణంలోని 11వ వార్డు బొమ్మాయిపల్లి గ్రామంలో జెండా శాఖ కార్యదర్శి బండి రవి సీపీఐ(ఎం) జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాయ కృష్ణ హాజరయ్యారు. అనంతరం ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఎల్లమ్మ గుడి వద్ద సీఐటీయూ జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాయ కృష్ణ మాట్లాడుతూ, కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. పని గంటలను పెంచడం వల్ల కార్మికులపై భారం పెరిగి నిరుద్యోగం తీవ్రతరమవుతోందని అన్నారు.

కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు రూపొందిస్తూ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు బందెల ఎల్లయ్య, వనం రాజు, వోల్దాస్ అంజయ్య, పర్వత్ బాలకృష్ణ, దండు గిరి, బండి రవి, గుండెబోయిన కృష్ణ, చింతల శివ, కొత్త లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మే డే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు అవసరం: మాయ కృష్ణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News