కారు గుర్తుకే ఓటు
పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పిలుపు
ఏదులాపురం:
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు 7వ వార్డులో సీపీఎం బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొల్లం నాగయ్యను కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మాయమాటలకు మోసపోకుండా అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, సీపీఎం పార్టీ పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్, మాజీ ఖమ్మం జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ కురాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి