Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:36 PM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి

02-01-2026 149 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేటకు న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యం : కాంగ్రెస్ నేతల పిలుపు

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సూర్యాపేటకు న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు పిలుపునిచ్చారు.

శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేలా ముందస్తు వ్యూహాలతో పని చేయాలని, రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా సూర్యాపేటలో ఈ సన్నాహక కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మున్సిపల్ ఓటర్ జాబితా ఇప్పటికే విడుదలైన నేపథ్యంలో ఆయా వార్డుల నాయకులు అధికారులతో సమన్వయం చేసుకొని ఓటరు జాబితాలోని సందేహాలు, లోపాలను వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి నాయకుడు వార్డులోనే ఉండి ప్రజలను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకోవాలని, వ్యూహరచనలో వెనుకబడొద్దని స్పష్టం చేశారు.

ఈ నెల 5వ తేదీ నుంచి సంక్రాంతి పండుగ వరకు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. రిజర్వేషన్ల మార్పుల కారణంగా ఇతర వార్డులకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆ వార్డుల నుంచీ, అలాగే భార్య లేదా తల్లి పేరుతో పోటీ చేయాలనుకున్నా వారి పేర్లతో కూడా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 48 వార్డులకు 500కు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపిక కోసం నాలుగు వార్డులకు ఒక సీనియర్ నాయకులతో కూడిన అబ్జర్వర్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కమిటీ వార్డుల వారీగా విచారణలు, సర్వేలు నిర్వహించి గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తుందని పేర్కొన్నారు.

టికెట్ రాని వారు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో పదేళ్లపాటు కొనసాగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల కోసం సూర్యాపేటకు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందులో వార్డుల వారీ అభివృద్ధి అంశాలను చేర్చేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

వార్డుల స్థాయిలో ఎలాంటి చిన్న పొరపాట్లు జరిగినా అవి పార్టీకి, ఎన్నికల ఫలితాలకు నష్టం చేకూరుస్తాయని, అందుకే ప్రతి నాయకుడు, కార్యకర్త అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పట్టణాభివృద్ధి అధికార పార్టీ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ప్రజల్లోకి తీసుకెళ్లి అందరూ కలసి కట్టుగా పని చేసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News