Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:40 AM

మునిపంపులలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు

25-12-2025 193 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ప్రతినిధి రామన్నపేట

రామన్న పేట మండలంలోని మునిపంపులలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

మాజీ ప్రధాని, భారతరత్న దివంగత అటల్ బిహారీ వాజ్ పెయ్ 101వ జయంతి సందర్భంగా బీజేపీ మునిపంపుల గ్రామశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సింగిల్ విండో డైరెక్టర్, మాజీ ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరా చారి మాట్లాడుతూ… అటల్ బిహారీ వాజ్ పెయ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆయన చూపిన స్ఫూర్తితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజాసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.

రాజకీయ పరిస్థితులు మారినా వ్యక్తిత్వాన్ని, విలువలను ఎప్పుడూ తాకట్టు పెట్టని మహానేత వాజ్పేయి అని గుర్తు చేశారు. అవకాశం కోసం రంగులు మార్చకుండా, విలువలతో కూడిన రాజకీయం చేసిన అరుదైన నాయకుడు ఆయనని కొనియాడారు. శత్రువులు సైతం శభాష్ అనకుండా ఉండలేని స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తిత్వమని అన్నారు.

పదవుల కోసం పాకులాడకుండా, అవసరమైతే ప్రధాని పదవినే తృణప్రాయంగా వదిలేసిన నాయకుడు వాజ్పేయి అని తెలిపారు. నేటి యువతకు ఆయన ఒక జీవంత ఆదర్శమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డోగిపర్తి భాస్కర్, ఏలూరు రవి, వార్డు మెంబర్ యాదాసు లక్ష్మణ్, తెల్కలపల్లి బిక్షం, పిట్ల నర్సింహా, చోల్లేటి చంద్రశేఖర్ చారి, బేతు శ్రీనివాస్, గంజి రాధాకిషన్, కొమిరె తిరుమలేశ్, అదొండ నర్సింహా, బూడిద కిరణ్, మామిండ్ల కృష్ణ, గాదె సురేష్ బాబు, కర్నాటి నరేష్ నేత, పున్న శ్రీకాంత్ నేత, పాలాల శేఖర్, బేతు ధర్మేందర్, కె. రామకృష్ణ చారి, మమిండ్ల రామ్ నాగేందర్, ఏలూరి బాలకృష్ణ, పాలల సురేష్, తల్కాళ్లపల్లి నందు, గాదె అశోక్, గాదె శ్రీకాంత్, పాలాల వంశీ, మమిండ్ల శ్రీకాంత్, మిర్యాల వెంకటేష్, ఆదొండ హరినాథ్, తెల్కలపల్లి గిరి, బూడిద కిషన్, కొమిరె ప్రశాంత్, పిట్ల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మునిపంపులలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News